జీతాల గోల

20 Jul, 2016 22:58 IST|Sakshi
జీతాల గోల
– డీఆర్‌డీఏలో మూడు నెలలుగా అందని వేతనాలు 
– ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
– పట్టించుకోని ఉన్నతాధికారులు 
 
అనంతపురం టౌన్‌ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లోని ఉద్యోగుల పరిస్థితి. జీతాల కోసం బడ్జెట్‌ విడుదలైనా ఖాతాల్లో జమ కాకపోవడంతో  వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.  వివరాల్లోకి Ðð ళ్తే.. డీఆర్‌డీఏలో ఈఓఆర్‌డీ, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, ఏఓ, సూపరింటెండెంట్, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లు ఇలా అన్ని క్యాడర్లు కలిపి సుమారు 27 మంది వరకు ఉన్నారు. వీరందరూ మూడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమైన వేళ కొందరు  అప్పులు చేసి పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టుకున్న దయనీయ స్థితి.  
 
రెండు నెలల కిందట జీతాల కోసం సెర్ప్‌ నుంచి బడ్జెట్‌ విడుదలైంది. ఓ దఫా రూ.22 లక్షలు, మరో దఫా రూ.15.50 లక్షల వరకు వచ్చింది. అయితే  జీతాలకు సంబంధించి ట్రెజరీకి బిల్లు పెట్టే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  ట్రెజరీకి వెళ్లాల్సిన సంబంధిత అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.   గ్రూపు తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక అధికారికి సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగి ట్రెజరీకి వెళ్లే విషయంలో అనాసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గతంలో  కలెక్టర్‌ కోన శశిధర్‌ చొరవ తీసుకోవడంతోనే జీతాల సమస్య పరిష్కారమైనట్లు సమాచారం. గాడితప్పిన ఈ వ్యవహారంపై   కలెక్టర్‌  ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
––––––
రెండు నెలల జీతాలు పెండింగ్‌లో  ఉన్నాయి..
ఉద్యోగులకు మే, జూన్‌ నెల జీతం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ట్రెజరీకి బిల్లు పెట్టాం. అక్కడి అధికారులతో నేనే స్వయంగా మాట్లాడాను. రూ.22 లక్షలకు ఒకే అయింది. మిగతాది కూడా అవుతుంది. రెండు, మూడ్రోజుల్లో జీతాలు అందుతాయి.
– వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ–వెలుగు పీడీ  
మరిన్ని వార్తలు