బీబీనగర్‌లో సేల్స్‌టాక్స్‌ అధికారుల తనిఖీలు

24 Sep, 2016 21:59 IST|Sakshi
బీబీనగర్‌లో సేల్స్‌టాక్స్‌ అధికారుల తనిఖీలు
బీబీనగర్‌:
మండల కేంద్రంలోని పూసల గోదాములో శనివారం భువనగిరికి చెందిన సేల్స్‌టాక్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించకుండా ఓç ³రిశ్రమ నుంచి అక్రమంగా ముడి సరుకును తీసుకువచ్చి గోదాములో ఉంచి రవాణా చేస్తున్నారని  సమాచారం అందింది. దీంతో అధికారులు గోదాముకు చేరుకొని రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోని రికార్డుల్లో నమోదు చేయకుండా, పన్ను చెల్లించకుండా గోదాముల్లో నిల్వ ఉంచిన అయిల్‌ తయారీకి ఉపయోగించే 3వేల టన్నుల డీ అయిల్డ్‌ కిక్‌ బస్తాలు, 630టన్నుల సన్‌ప్లై పౌడర్‌ బస్తాలు, 6లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను గుర్తించినట్లు ఏఎస్‌టీఓ విజయ్‌కుమార్‌ తెలిపారు. దీంతో స్టాక్‌ వేసి ఉన్న 3బ్లాక్‌ల గోదాములను సీజ్‌ చేశామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంత వరకు సరుకును తరలించకూడదని సంబంధిత వ్యక్తికి సూచించి గోదాం ఇన్‌చార్జీగా ఉన్న నగేష్‌కు నోటీస్‌ అందజేశారు.
యజమానిపై చర్య తీసుకోవాలి
మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆనంద్‌ సాల్వెక్స్‌ పరిశ్రమ నుంచి ముడి సరుకును కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా తప్పుడు బిల్లులతో సరుకును తరలించే యత్నం చేస్తున్న సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఆనంద్‌ సాల్వెక్స్‌ పరిశ్రమ బాధిత కార్మికులు డిమాండ్‌ చేశారు. ఆనంద్‌ సాల్వెక్స్‌లో పని చేసిన తమకు వేతనాలను చెల్లించకుండా యాజమాన్యం పరిశ్రమను మూసి వేసి ఇతర వ్యక్తులకు ప్రొడక్షన్‌ను విక్రయించిదని, దీంతో వారు పన్ను చెల్లించకుండా స్టాక్‌ను తరలించే యత్నం చేస్తున్నారని అధికారులకు విన్నవించారు.
 
 
 
మరిన్ని వార్తలు