సెలైన్‌తో మొక్కలకు ప్రాణం

23 Jul, 2016 23:05 IST|Sakshi
సెలైన్‌తో మొక్కలకు ప్రాణం
  • వినూత్న ఆలోచనకు
  • కలెక్టర్‌ ప్రశంస
  • సోషల్‌ మీడియాలో పెట్టండి
  • అధికారులకు రోనాల్డ్‌ రోస్‌ సూచన
  • జూనియర్‌ కళాశాలలో హరితహారం
  • జగదేవ్‌పూర్‌: సెలైన్‌తో మొక్కలను కాపాడుతున్న తీరును కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ప్రశంసించారు. శనివారం ఆయన జగదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. సెలైన్‌ ఆలోచనను మెచ్చుకున్నారు. ఈ ఆలోచన ఎవరిది? అని కలెక్టర్‌ ఆరా తీయగా తానేనంటూ కళాశాల లెక్చరర్‌ మోహన్‌దాస్‌  ముందుకు రావడంతో అభినందించారు. ఆలోచన బాగుంది, వెంటనే సోషల్‌ మీడియాలో పెట్టండి అంటూ పక్కనే ఉన్న అధికారులకు ఆదేశించారు.

    మొక్కలను సెలైన్‌ డ్రిప్పు పద్ధతి బాగుంది.. మొక్కలకు ఎవరు పేరు పెట్టారు? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ఎవరు నాటిన మొక్కకు వారి పేరే పెట్టుకున్నామని విద్యార్థులు చెప్పడంతో కలెక్టర్‌ శభాష్‌ అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఐడియా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రయోగాలు చేసి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు.

    అనంతరం ప్రిన్సిపాల్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్‌ పరమేశం, సర్పంచ్‌ కరుణకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు