ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

12 Dec, 2016 15:20 IST|Sakshi
పెద్దాపురం : 
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకుని, దైవచింతనతో ఉండాలని కంచి కామకోటి  పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. కార్తిక మాసం పంచారామ క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త మట్టే శ్రీనివాస్,  మందవిల్లి శ్రీనివాస ముత్యాలు గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో  విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ లోకం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. «ఆధ్యాత్మిక భావాలు, దైవచింతన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచి మహా సంస్థానం అధ్యక్షలు చంద్రాభట్ల గణపతి శాస్త్రీ, ఆధ్యాత్మిక గురువులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో పూజలు
సామర్లకోట : స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కంచి కామకోటి  పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మంగళవారం రాత్రి పూజలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురం నుంచి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ నాయకులు స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో పూజలు చేశారు.  కంచికామకోటి పీఠం సభ్యులు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి, పతంజలి శాస్త్రి, విజయేంద్రసరస్వతి శిషులు పాల్గొన్నారు. అనంతరం వేట్లపాలెం గ్రామంలోని రామకృష్ణ సేవా సమితిని సందర్శించారు.
 
మరిన్ని వార్తలు