బైక్‌లో దూరిన పాము

22 Jul, 2017 21:46 IST|Sakshi
బైక్‌లో దూరిన పాము

ఆత్మకూరు: ద్విచక్రవాహనంలో దూరిన ఓ పాము కలకలం రేపింది. గొరిదిండ్లకు చెందిన రాము శనివారం ఉదయం తన ద్విచక్రవాహనంలో ఆత్మకూరుకు బయల్దేరాడు. పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే బైక్‌ నడుపుతున్న రాము కుడిచేతి మీదకు ఒక పాము పాకుతూ వచ్చింది. బిత్తరపోయిన ఆయన వెంటనే బండి ఆపాడు. అయితే ఆ పాము డూమ్‌లోకి వెళ్లి బయటకు రాలేదు. సమీపంలోని మెకానిక్‌ వద్ద డూమ్‌ తెరిపించగా బయటకు వచ్చిన పాము స్థానికులపైకి వస్తుండటంతో అరవింద్‌ అనే వ్యక్తి కర్రతో దాన్ని చంపేశాడు. ఇంటి ముందు ద్విచక్రవాహనం ఉంచినపుడు పాము ఎక్కి ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు