శాంతించిన గోదారమ్మ

29 Sep, 2016 00:27 IST|Sakshi
  • ఊపిరి పీల్చుకున్న అధికారులు
  • మంగపేట : ఎగువ ప్రాంతాల నుంచి వివిద జలాశయాల నుంచి విడుదల చేసిన వరదనీటిలో మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉగ్ర రూపందాల్చి పరుగులు తీసిన గోదారమ్మ బుధవారం సాయంత్రం నుంచి తగ్గు ముఖం పట్టడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం నుం చి కాళేశ్వరం వద్ద వరదనీటి ఉదృతి పెరగడంతో అర్దరాత్రి వరకు గోదావరి వరదనీరు భారీగా పెరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అం దించి అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ ఉదయం 7 గంటల వరకు వరద ఉదృతి భారీగా పెరగడంతో తహసీల్దార్‌ తిప్పర్తి శ్రీనివాస్, ఆర్‌ఐ అశోక్‌రెడ్డి పుష్కరఘాట్‌ వద్ద వరద తీవ్రతను పరిశీలించారు. ఉదృతి పెరిగే అవకాశాలు ఉండంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలయిన కత్తిగూడెం, అకినేపల్లిమల్లారం, బోరునర్సాపురం వీఆ ర్వోలను అప్రమత్తం చేశారు.
     
    మద్యాహ్నం 3 గంటల నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గోదావరి వరద నీటి ఉధృతికి కోతకు గురవుతున్న ఒడ్డును చిన్ననీటి పారుదల శాఖ డిఈఈ రవికాంత్, ఈఈ రాంప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. కాగా మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుష్కరఘాట్‌ను సందర్శించారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకబస్తాలు ఏర్పాటు చేసి ఒడ్డు కోతకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మైనర్‌ ఇరిగేష¯ŒS అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రాత్రికి రాత్రి కూలీలతో సుమారు 100 సిమెంటు బస్తాల్లో ఇసుక నింపి ఒడ్డు వెంట ఏర్పాటు చేశారు. అయినప్పటికి బుధవారం వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇసుక బస్తాల్లో కింద ఒండ్రు మట్టితో కూడిన ఇసుక కోతకు గురికావడంతో కొంత మేరకు ఇసుక బస్తాలు గోదావరిలోకి జారి పోయాయి. బస్తాలు జారిపోయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 
>
మరిన్ని వార్తలు