ఓపెన్‌ టు ఆల్‌ విజేత సరయు

23 Jul, 2016 23:39 IST|Sakshi
వరంగల్‌ స్పోర్ట్స్‌ : వరంగల్‌ చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ మహేశ్వరి కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ఓపెన్‌ టు ఆల్‌ చెస్‌ పోటీల్లో హన్మకొండకు చెందిన వేల్పుల సరయు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా శాప్‌ మాజీ డైరక్టర్‌ రాజనాల శ్రీహరి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.
 
ద్వితీయ విజేతగా ఎం.శ్రీకాంత్, తృతీయ స్థానాన్ని ఆర్‌.శివకుమార్‌ దక్కించుకున్నట్లు నిర్వాహకుడు సంపత్‌ తెలిపారు. అండర్‌–15 కేటగిరీలో విజేతగా అభిలాష్, ద్వితీయ స్థానంలో కార్తికేయ అండర్‌–13 విభాగంలో థామస్, జాహిద్‌ఖాన్‌లు వరుస రెండు స్థానాల్లో నిలువగా దీపక్‌ ప్రత్యేక ప్రతిభ కనబరిచి బహుమతులను అందుకున్నట్లు తెలిపారు.
 
మరిన్ని వార్తలు