చీరతో కట్టి పడేశారు

12 Nov, 2016 21:05 IST|Sakshi
చీరతో కట్టి పడేశారు
 చీర కట్టి ఆడతనం పెంచుకో..అంటూ ఓ సినీ గేయ కవి తెలుగు దనం ఉట్టిపడేలా చీర గొప్పదనం గురించి చెప్పారు. అదే స్ఫూర్తితో చీరను ఎన్ని రకాలుగా కట్టొచ్చో కట్టి చూపించారు కిఫ్ట్‌ ఫ్యాష¯ŒS కళాశాల విద్యార్థినులు. శనివారం కాకినాడ కిఫ్ట్‌ కళాశాల 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన యూత్‌ఫెస్ట్‌–16లో 72 రకాలుగా చీరను ధరించి అదరగొట్టారీ వనితలు. ఓ ప్రైవేట్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు చీరకట్టులో తళుక్కున మెరిసారు. గోగ్రీ¯ŒS వస్రా్తలంకరణలో అదరహో అనిపించారు. కిరాక్‌..కిరాక్‌... అంటూ కురక్రారు చేసిన డ్యా¯Œ్సలతో మైమరపించారు. ఫ్యాష¯ŒS షోలో భాగంగా వయ్యారాలు ఒలకబోసుకుంటూ అతివలు ర్యాంప్‌పై నడిచిన విధానం భారతీయ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. కళాశాల చైర్మ¯ŒS లింగయ్య చౌదరి, ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి పాల్గొన్నారు.
– భానుగుడి (కాకినాడ)
 
>
మరిన్ని వార్తలు