ఏకదంతుడికి శతకలశ క్షీరాభిషేకం

22 Sep, 2016 18:11 IST|Sakshi
కలశాలను ఊరేగింపుగా తెస్తున్న అధికార బృందం
–తరలివచ్చిన భక్తజన సమూహం 
కాణిపాకం(ఐరాల):
స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా  గురువారం ఉదయం  శతకలశ క్షీరాభిషేకం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాకార మండపంలో ఉభయదారులు ఉత్సవమూర్తులకు  సాంప్రదాయ బద్ధంగా అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో  దేవస్థాన సిబ్బంది, అర్చకులు, వేదపండితులు ఆలయ సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. వారితో పాటు గ్రామస్తులు  క్షీర కలశాలను  కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ  వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ తేనె, నెయ్యి , పెరుగు, పాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి, దూపధీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయాధికారులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ పూర్ణచంద్రారావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్‌ రవీంద్ర బాబు , ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున  పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
>
మరిన్ని వార్తలు