సత్యదేవునికి రూ.5 లక్షల విరాళం

6 Apr, 2017 23:51 IST|Sakshi
అన్నవరం : 
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన ముగ్గురు సోదరులు వారి తల్లి ఈశ్వరమ్మ పేరుమీద గురువారం రూ.ఐదు లక్షల విరాళాన్ని దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావుకు కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు. ఈ మొత్తంలో రూ.లక్ష  బొత్స తల్లి పేరు మీద బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో ఏటా  కార్తీకపౌర్ణమి నాడు అన్నదానం చేయాలని కోరారు. అలాగే రూ.లక్ష బొత్స సత్యనారాయణ పేరున డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో ఏటా జూలై తొమ్మిదిన అన్నదానం చేయాలని కోరారు. బొత్స సోదరుడు అప్పలనర్సయ్య పేరు మీద డిపాజిట్‌ చేసిన రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏప్రిల్‌ 26, మరో సోదరుడు సతీష్‌ పేరున వేసిన రూ.లక్షకు వచ్చే వడ్డీతో సెప్టెంబర్‌ 19న, ఇంకో సోదరుడు ఆదినారాయణ పేరున ఉన్న రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్‌ 29న అన్నదానం చేయాలని అధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు