సత్యదేవుని మెట్లోత్సవం ఏర్పాట్లపై ఈఓ సమీక్ష

13 Dec, 2016 21:58 IST|Sakshi
  • రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం
  • అన్నవరం : 
    ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఈనెల 15వతేదీ గురువారం నిర్వహించనున్న సత్యదేవుని మెట్లోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కొండదిగువన తొలిపాంచా వద్ద నుంచి ప్రధానాలయం వరకూ ఉన్న మెట్లన్నింటినీ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మెట్లకు, వాటికిరువైపులా ఉన్న గోడలకు తెలుపు, కాషాయం రంగులను వేయించాలని ఆదేశించారు. అదే విధంగా కార్యక్రమానికి ముందు రోజు నుంచి మెట్ల మార్గంలో గల యాచకులను అక్కడి నుంచి పంపించి వేయాలని ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్‌ కొండలరావు, ప్రైవేట్‌ శానిటరీ ఏజెన్సీ ఇ¯ŒSచార్జి కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
    కార్యక్రమం వివరాలు..
    సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఊరేగింపుగా మెట్ల మార్గాన కొండదిగువకు తీసుకువస్తారు. తొలిపాంచా వద్ద గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఘనంగా ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి మెట్ల దారిలోని ప్రతిమెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి హారతి వెలిగిస్తూ,  పల్లకీపై స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ప్రధానాలయానికి చేరుస్తారు. 
     
మరిన్ని వార్తలు