నిర్దోషికి ఎనిమిదిన్నరేళ్ల శిక్షా ?

1 Apr, 2017 23:26 IST|Sakshi
  • సత్యంబాబుకు నష్టపరిహారం ఇవ్వాలి  ∙
  • ప్రజా సంఘాల నాయకులు
  • రాజమహేంద్రవరం క్రైం : 
    ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిని చేస్తూ పిడతల సత్యంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఏ పాపం తెలియని నిర్దోషి ఎనిమిదిన్నర ఏళ్లు జైలుశిక్ష అనుభవిం చాడరన్నారు. సత్యంబాబుపై పెట్టిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేయడంతో శనివారం అతడు విడుదల అవుతాడని సత్యంబాబు తల్లి మరియమ్మ, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు లాయర్‌ పి.శ్రీనివాస్, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ రైట్స్‌ ప్రొటెక్ష¯ŒS  సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీ¯ŒS కుమార్, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, బహుజన సమాజ్‌ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు తదితరులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే హైకోర్టు నుంచి ఉత్తర్వులు సకాలంలో అందకపోవడంతో సత్యంబాబు విడుదల ఆదివారానికి వాయిదా పడింది. కాగా.. జైలు వద్ద మరియమ్మను మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌  కలిశారు.
     
    న్యాయం చేయాలి
    ఏ నేరం చేయని నా కుమారుడు సత్యంబాబు ఎనిమిదిన్నర ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. నా కుమారుడిని అన్యాయంగా జైలులో పెట్టారు. దాన్ని తట్టుకోలేక నా భర్త బెంగతో మృతి చెందాడు. నా కుమారుడిని జైలులో పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి.                 
    – మరియమ్మ, సత్యంబాబు తల్లి
     
    ఉద్యోగం ఇవ్వాలి
    సత్యంబాబును అన్యాయంగా జైలులో పెట్టడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అతడికి ఉద్యోగం ఇచ్చి నష్టపరిహారం అందించాలి. పోలీసులు తొమ్మిది నెలలు దర్యాప్తు చేసి హాస్టల్‌ పరిసర ప్రాంతాల్లోని 1300 మందిపై కేసులు నమోదు చేశారు. చివరకు సత్యంబాబును ఇరికించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, డీఎ¯ŒSఏ రిపోర్టు, శవం వద్ద ఉన్న లెటర్‌ను కూడా తారుమారు చేశారు. 
    – శ్రీనివాస్, సత్యంబాబు న్యాయవాది
    అమాయకుడిని బలి చేశారు
    ఆయేషా ఘటనలో ఓ అమాయకుడిని పోలీసులు బలి చేశారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో పెరిగింది. హత్య ఘటనతో సత్యంబాబుకు సంబంధం లేదని మృతురాలు ఆయేషా మీరా తల్లి  చెబుతున్నా పోలీసులు వినలేదు. ఆమాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులపై శాఖాపరమైన విచారణ జరిపాలి.                – ముప్పాళ్ల సుబ్బారావు, 
    ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 
     
మరిన్ని వార్తలు