కల్వకుంట..జర భద్రం

3 Aug, 2016 17:35 IST|Sakshi
కల్వకుంట..జర భద్రం

సంగారెడ్డి మున్సిపాలిటీ:బైక్‌ అయిన,, కారులైన.. చివరకు స్కూల్‌ బస్సులైన ఈ దారిన  కాస్తా చూసే వెళ్లాల్సి వస్తోంది.. లేదంటే బోల్తా కొట్టడమే.. మట్టిలో ఇరుక్కోవడం జరుగుతుంది.  ఇది ఎక్కడో కాదు సాక్షత్తు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని లాల్‌సాబ్‌ గడ్డ - కల్వకుంట ప్రధాన రహదారి దుస్థితి. లాల్‌సాబ్‌ గడ్డ నుంచి కల్వకుంటకు వెళ్లే రహదారి నిర్మాణం కోసం 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌నగర్‌ బాట కార్యక్రమంలో భాగంగా రోడ్డు పనులను ప్రారంభించారు.  అదే సమయంలో కల్వకుంట నుంచి పాత బస్టాండ్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు.

అందుకుగాను డబుల్‌ లైన్‌ రోడ్డు నిర్మాణం చేయడం కోసం అధికారులు సర్వే చేసి పనులు సైతం ప్రారంభించారు. కాని పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయాలేకపోతున్నారు.ఈ సమస్యపై 15వ వార్డు కౌన్సిలర్‌ మున్సిపల్‌ పాలకవర్గ సమావేశంలో ప్రతిసారి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా ఏమాత్రం ఫలితం లేకపోయింది. గత వారం రోజులుగా వరుసగా వర్షలు కురియడంతో ఈ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మట్టి రోడ్డు కావడంతో ఎక్కడా పడితే అక్కడ వాహనాలు బోల్తా పడుతున్నాయి. రాత్రి వేళలలో అయితే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు కిందపడి గాయాలపాలవుతున్నారు. పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులు సైతం ఈ రోడ్డున వచ్చి మట్టీలో ఇరుక్కు పోయి పంట పొలాల్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
తమ వార్డులో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారేమాత్రం పట్టించుకోవడంలేదు.   పాలకవర్గ సమావేశంలో సైతం తాను ఈ విషయంపై ప్రస్తావించినా కమిషనర్‌గాని, ఇంజనీర్లు గాని స్పందించడం లేదు. దీంతో స్కూల్‌కు వెళ్లే పిల్లలు సైతం బురదలోనే వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.
-జహినాద్‌బేగం, వార్డు కౌన్సిలర్‌

మరిన్ని వార్తలు