నాటిన ప్రతి మొక్కను బతికించండి

22 Jul, 2016 00:27 IST|Sakshi
నాటిన ప్రతి మొక్కను బతికించండి
చౌటుప్పల్‌: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి బతికించాలని సీఎం అదనపు కార్యదర్శులు స్మితాసబర్వాల్, ప్రియాంకవర్గీస్‌లు అధికారులకు సూచించారు. గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. చౌటుప్పల్‌లోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి, నీళ్లు పోశారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై ఆరా తీశారు. హైవే వెంట నాటిన మొక్కలపై నిఘా ఉంచాలని సూచించారు. నాటినవి ఎన్ని, బతికినవి ఎన్ని అని ఆరా తీశారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 20నుంచి 40వేల మొక్కలు నాటాలని, ఈ నెల 30వ తేదీ వరకు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, డీఎఫ్‌ఓ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ షేక్‌అహ్మద్, ఎంపీడీఓ రజిత, సర్పంచ్‌ బొంగు లావణ్య, ఎం.దయాకరాచారి, ఆల్మాసుపేట కష్ణయ్య, అటవీ శాఖ అధికారిణి సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు