మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

3 Aug, 2016 22:47 IST|Sakshi
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి
కరీంనగర్‌ :  తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకు ఉద్యమించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(ఎంహెచ్‌పీఎస్‌) రాష్ట్ర వ్యవస్థాపక అధ్య«క్షుడు మైస ఉపేందర్‌ కోరారు. సోమవారం కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ జ నాభా గల మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను రూ.5లక్షలకు పెంచాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రాజు, ప్రధాన కార్యదర్శి గజ్జెల నాగేశ్వర్‌రావు, నాయకులు దామెర సతీశ్, కనకం రవి, ప్రభాకర్, బాబు, వివిధ నియోజక వర్గాల ఇన్‌చార్జీలు లక్ష్మణ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మంద శ్రీనివాస్, సురేష్, రాజు పాల్గొన్నారు. 
 
5న మాదిగల ధూంధాం
కరీంనగర్‌లోని రెవెన్యూగార్డెన్‌లో ఈనెల 5న ధూంధాం నిర్వహిస్తున్నట్లు సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర కన్వీనర్‌ మారంపెల్లి రవీందర్‌ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా ఈ కార ్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రెస్‌భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఎస్సీవర్గీకరణ చేపడతామన్న బీజేపీ స్పందించడం లేదన్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల సాగర్, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాతంగి రమేశ్, నాయకులు గోష్కి అజయ్, గంగారాజు, భాస్కర్, మహేశ్, మహేందర్, రాజేశ్, శశి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు