శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ

12 Dec, 2016 15:22 IST|Sakshi
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ ఆదివారం మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అధికారులు మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనల అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు హరిప్రియ విలేకరులకు తెలిపారు. పిల్ల జమిందార్‌ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు లభించిందన్నారు. 
 
మరిన్ని వార్తలు