లెక్కల టీచర్ వక్రబుద్ధి.. స్కూలుకు తాళాలు

26 Oct, 2015 14:31 IST|Sakshi
లెక్కల టీచర్ వక్రబుద్ధి.. స్కూలుకు తాళాలు

ప్రకాశం: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కర్తవ్యం మరిచి పక్కా దారి పట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. స్కూల్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నాడు. దీనిపై ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళాలు వేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో సోమవారం చోటుచేసుకుంది.

స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లెక్కల మాస్టరు తన వక్రబుద్ధిని చూపిస్తున్నాడు. ఆరు నెలల క్రితం తొమ్మిదో తరగతి బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లిపోయాడు. దీంతో అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. తాజాగా మరో బాలికను దసరా సెలవుల్లో తనతో పాటు చీరాలకు తీసుకువెళ్లాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు సోమవారం అతడు పాఠశాలకు వస్తే నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అతడు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు. సదరు టీచర్ విషయమై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం ఝాన్సీలక్ష్మీబాయిని కోరారు.

మరిన్ని వార్తలు