తల్లిదండ్రులకు టెన్షన్..టెన్షన్!

3 Dec, 2016 03:51 IST|Sakshi
తల్లిదండ్రులకు టెన్షన్..టెన్షన్!

ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు
త్రుటిలో తప్పించుకున్న చిన్నారులు

 శివాపురం (పెద్దారవీడు): ఉదయాన్నే లేచి స్నానం.. టిఫెన్ చేసిన చిన్నారులు బస్సులో స్కూల్‌కు బయలుదేరారు. ఇంతలోనే వాహనం ప్రమాదానికి గురైందన్న వార్త వినడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కానీ ఎలాంటి ఘోరం జరగకపోవడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. వివరాలు.. మండల పరిధిలోని శివాపురం నుంచి మార్కాపురం వెళ్తున్న స్కూల్ బస్సు మార్గమధ్యంలోని రోడ్డు మార్జిన్‌లో పక్కకు ఒరిగింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పెద్దారవీడు, కొత్తపల్లె, శివాపురం, దేవరాజుగట్టు గ్రామాలకు చెందిన విద్యార్థులు మార్కాపురం పట్టణంలో ఉన్న సారుు చైతన్య హై స్కూల్‌కు ప్రతి రోజూ వెళుతుంటారు.

శుక్రవారం డ్రైవర్ ఆయా గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుంటూ శివాపురం చేరుకున్నాడు. ఆ సమయంలో మొత్తం 40 మంది    విద్యార్థులున్నారు. అక్కడ నుంచి రోడ్డు గుంతలమయంగా ఉంది. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో  ముందు టైరుకు ఉన్న ఇనుప ప్లేట్ విరిగిపోరుుంది. దీంతో వాహనం రోడ్డు మార్జిన్ నుంచి పక్కకు                ఒరిగిపోరుుంది. భయాందోళనలకు గురైన చిన్నారులు హాహాకారాలు చేశారు. సీటు ముందు ఉన్న రాడ్‌కు           తగిలిన ఇద్దరు చిన్నారుల తలలకు బొప్పి కట్టింది. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు వారిని               బయటకు తెచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు.

మరిన్ని వార్తలు