శాస్త్రీయ వేదిక.. నైపుణ్యాల మాలిక

30 Aug, 2016 01:07 IST|Sakshi
శాస్త్రీయ వేదిక.. నైపుణ్యాల మాలిక
  • జిల్లాలో మెుదలైన సైన్స్‌ సంబురాలు
  • ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్న విద్యార్థులు
  • ప్రతిభా పాటవాలను వెలికితీస్తున్న ఉపాధ్యాయులు
  • మానుకోటలో వచ్చేనెల 15, 16, 17 తేదీల్లో ఇన్‌స్పైర్‌
  • అక్టోబర్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌
  • నవంబర్‌ నెలలో సైన్స్‌ఫేర్‌
  •  
    మహబూబాబాద్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సైన్స్‌ కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రస్తుత ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు పాuý శాల నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించనున్న సైన్స్‌ సెమినార్, ఇన్‌స్పైర్, జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్, సైన్స్‌ఫేర్‌లతో సందడి నెలకొంది. ఆయా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులు ఇప్పటì నుంచే కృషి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విద్యార్థుల్లో శాస్త్రీయ అన్వేషణ, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేందుకు సైన్స్‌ మ్యూజియాల జాతీయ మండలి ప్రతి ఏటా సైన్స్‌ సెమినార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆగస్టులో పాఠశాల నుంచి మొదలై జిల్లా వరకు సుమారు 20 రోజుల పాటు విద్యాశాఖ, ఎస్‌సీఆర్‌టీ ఆధ్వర్యంలో జిల్లాలో సైన్స్‌ సెమినార్లు నిర్వహించారు. సుస్థిర ఆహారభద్రతకు ‘పప్పు ధాన్యాలు, అవకాశాలు–సవాళ్లు’ అంశంపై సెమినార్‌ నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.
     
    మానుకోటలో ఏర్పాట్లు
     
    వచ్చే నెల 15 నుంచి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మానుకోటలో 15, 16, 17 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అర్హత పొందిన 564 మంది విద్యార్థులతో పాటు నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇన్‌స్పైర్‌ అవార్డులతో రెండు డీఎల్‌పీఈలు (జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు–ప్రాజెక్టుల పోటీలు) నిర్వహించనున్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించే ఇన్‌స్పైర్‌తో విద్యార్థులను శాస్త్రీయ పరిశోధన వైపు మళ్లించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. కాగా, ఇన్‌స్పైర్‌ అవార్డు కింద ఎంపికైన విద్యార్థికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ డబ్బులను విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించుకోవడం, దాన్ని ప్రదర్శించడం, రవాణా ఖర్చులకు వినియోగించుకోవాలి.
     
    రెండు దశాబ్దాలుగా ‘ఎన్‌సీఎస్‌సీ’
     
    కేంద్ర విజ్ఞానశాస్త్ర మండలి, తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విద్యాశాఖ సహకారంతో రెండు దశాబ్దాలుగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ మూడో వారంలో జిల్లాస్థాయి ఎన్‌సీఎస్‌సీ నిర్వíß ంచేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్‌ జిల్లా నందిగామలో నవంబర్‌ రెండో వారంలో రాష్ట్రస్థాయి ఎన్‌సీఎస్‌సీని నిర్వహించనున్నారు. సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో గైడ్‌ టీచర్లకు 24వ ఎన్‌సీఎస్‌సీ ప్రధానాంశం‘సుస్థిర అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు’ అంశంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో విద్యార్థులు జట్టుగా ఏర్పడి స్థానిక సమస్యలకు శాస్త్రీయ అన్వేషణతో పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, విద్యార్థుల్లో క్షేత్రస్థాయి పరి శీలన, సమాచార సేకరణ, విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజ నాత్మకతను పెం పొందిస్తూ వారు పరిశోధనలు చేపట్టేలా ఎన్‌సీఎస్‌సీ ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.
     
    ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ‘సైన్స్‌ఫేర్‌’
     
    నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో నవంబర్‌లో సైన్స్‌ఫేర్‌ కార్యక్రమాలు కొనసాగుతాయి. గణిత, శాస్త్రీయ విషయాలపై విద్యార్థుల్లో సహజమైన అభిరుచి, ఆసక్తులు, సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి ఏటా జవహ ర్‌ లాల్‌ నెహ్రూ నేషనల్‌ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ ఫర్‌ చిల్ర్డన్‌ పేరిట నాలుగు దశాబ్దాలకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతాయి. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా నూతన బోధనలు, ప్రదర్శనలు నిర్వహించడమే సైన్స్‌ఫేర్‌ ఉద్దేశం.
     
    సృజనాత్మకతను వెలికితీసేందుకే..
     
    విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్‌ కార్యక్రమాలు దోహదపడుతాయి. సైన్స్‌ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన, వినూత్నమైన ప్రదర్శనలు, ప్రాజెక్టులను రూపొందించేందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిపుణులతో విస్తరణోపాన్యాసాలు, వర్క్‌షాపులు నిర్వహించాలి. ముఖ్యంగా విద్యార్థి కేంద్రంగా ఆవిష్కరణలు జరిగేలా చూడాలి.   – వి.గురునాథరావు, సైన్స్‌ కమ్యూనికేటర్‌  
మరిన్ని వార్తలు