రెండవ పటాలం పేరు నిలబెట్టండి

11 May, 2017 00:00 IST|Sakshi
– తెలంగాణకు రెండవ పటాలం నుంచి కానిస్టేబుళ్లు బదిలీ 
కర్నూలు: ఎక్కడ పనిచేసినా ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం పేరు నిలబెట్టాలని కమాండెంట్‌ శామ్యూల్‌ జాన్‌ కానిస్టేబుళ్లకు సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఏపీఎస్పీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మంచిర్యాల, బీచ్‌పల్లి బెటాలియన్లకు వారు అలాట్‌ అయ్యారు. బుధవారం సాయంత్రం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో సహోద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ శామ్యూల్‌ జాన్‌ మాట్లాడుతూ ఎక్కడ విధులు నిర్వహించినా ఎంపికైన బెటాలియన్‌కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ శశికాంత్, డీఎస్పీ ఎన్‌.వి.ఎస్‌.మూర్తి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు