హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

8 Nov, 2016 23:07 IST|Sakshi
హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు
- రెండోరోజు కొనసాగిన క్వాలీఫైయింగ్‌ మ్యాచ్‌లు
- తిలకించేందుకు తరలివచ్చిన క్రీడాభిమానులు
 
కర్నూలు (టౌన్‌): కర్నూలు నగరంలో ఆల్‌ ఇండియా బ్యాడ్మింటన్‌ సబ్‌జూనియర్‌ టోర్నమెంట్‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.  ఈనెల 10నుంచి జరిగే ఇన్నింగ్స్‌ పోటీల్లో అర్హత కోసం రెండురోజు మంగళవారం క్వాలీఫైయింగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు.  స్థానిక ఔట్‌డోర్‌ స్టేడియంతో పాటు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఔట్‌డోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.   మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి పోటీలు కర్నూలులో నిర్వహిస్తుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో రెండు రోజులుగా ఔట్‌డోర్‌ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.   
క్రీడా వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రీడాకారులు
 ఈనెల  13 వ  తేదీ వరకు జరిగే ఆల్‌ ఇండియా బ్యాడ్మింటన్‌ సబ్‌జూనియర్‌ పోటీల్లో పాల్గొనేందుకు  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు  నగరంలోని స్పోర్‌​‍్ట్స దుకాణాలకు క్యూ కడుతున్నారు. షటిల్‌ బ్యాడ్మింటన్, ప్రాక్టీస్‌ చేసుకునేందుకు షటిల్‌ కాక్, షూస్‌ కొనుగోళ్లతో మంగళవారం బిజిగా కనిపించారు. 
 
ఏర్పాట్లు బాగున్నాయి: రూపల్‌ పట్లే ( ఉత్తర్‌ ఖండ్‌ )
ఆల్‌ ఇండియా బ్యాడ్మింటన్‌ సబ్‌జూనియర్స్‌ టోర్నమెంట్‌కు చేసిన  ఏర్పాట్లు బాగున్నాయి. రెండవ రోజు క్వాలీఫైయింగ్‌ పోటీల్లో పాల్గొన్నా. ఎలాగైనా టోర్నమెంట్‌లో సత్తా చాటాలని ఇక్కడికి వచ్చాను.
 
మొట్టమొదటిసారి పాల్గొంటున్నా: హర్షిత (చత్తీస్‌ఘడ్‌)
జాతీయ స్థాయి పోటీల్లో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నా. క్వాలీఫైయింగ్‌ మ్యాచ్‌లోను గట్టిపోటీ ఉంది. అయినా, రాణిస్తానన్న నమ్మకం ఉంది.  
 
మరిన్ని వార్తలు