ఆర్‌యూలో రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు

3 Nov, 2016 00:24 IST|Sakshi
కర్నూలు సిటీ: రాయల సీమ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ చేయించాలని ఆ వర్సిటీ విద్యార్థి జేఏసీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో రెండో రోజుకు చేరాయి. పశ్చిమ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి కేవీ సుబ్బారెడ్డి ఈ దీక్షను ప్రారంభించి మాటా​‍్లడారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉందన్నారు. దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కూమార్, పీడీఎస్‌యూ కార్యదర్శి భాస్కర్, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌  మద్దతూ తెలిపారు.
నేడు ముగియనున్న దీక్షలు
మూడు రోజుల పాటు చేపట్టిన రిలే దీక్షలు గురువారంతో ముగియనున్నాయి. కార్యక్రమానికి రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి హాజరుకానున్నట్లు ఆర్‌యూ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షడు శ్రీరాములు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు