సత్తుపల్లిలో రెండో ఓసీ ప్రారంభించాలి

8 Aug, 2016 23:27 IST|Sakshi
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న కార్మికులు

సత్తుపల్లి రూరల్‌ : సత్తుపల్లిలో రెండో ఓసీని వెంటనే ప్రారంభించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) నాయకులు జోషి, సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. జేవీఆర్‌ ఓసీ–1లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సోమవారం నల్లబ్యాడ్జీల ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ జేవీఆర్‌ ఓసీ–1 ప్రాజెక్టు ప్రారంభించి 11 సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.  సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గెలిచినా, ఓడినా కార్మికుల పక్షానే ఉంటుందన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు, అధిక మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.  కార్మికులకు క్వార్టర్లు నిర్మించాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కూడా  నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన తెలుపుతారని అన్నారు. 10న ఆందోళన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందిస్తామన్నారు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) నాయకులు నర్సయ్య, జె.శ్రీను, సుబ్బారావు, కార్మికులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు