2నుంచి రెండో విడత పల్స్‌పోలియో

28 Mar, 2017 00:02 IST|Sakshi
– జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌
కర్నూలు(అగ్రికల్చర్‌):  ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. సోమవారం జిల్లా స్థాయి టాస్క్‌ పోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విధ్యా శాఖలతో పాటు పొదుపు మహిళలు, ఎంపీడీఓలు సహరించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పొదుపు సంఘాల మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్‌లు, బస్టాండులు, ఇతర జనరద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మురికి వాడలు, చెంచుగూడెంలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండో తేదీన బూత్‌ స్థాయిలో చుక్కలు వేయాలని, 3 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లాలన్నారు. పోలియో మహమ్మారి బారిన పడి ఎంతో మంది కాళ్లు, చేతులు లేక నరకం అనుభవిస్తున్నారని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, డీఎంహెచ్‌ఓ మీనాక్షిమహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు