సాహిత్యానికి పుట్టినిల్లు సీమ

26 Sep, 2016 22:16 IST|Sakshi
సాహిత్యానికి పుట్టినిల్లు సీమ
– జాతీయ స్థాయి తెలుగు లిటరరీ ఫోరంలో వక్తలు
– రంగరాజ చరిత్ర సీమ నవలనే
– రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగు సాహిత్యానికి రాయలసీమ ప్రాంతం పుట్టినిల్లు వంటిదని, అప్పట్లోనే అన్నమయ్య, వేమన తదితర గొప్ప రచయితలను అందించిన ఘనత సీమకే దక్కుతుందని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాలలో కేంద్రసాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తెలుగు లిటరరీ ఫోరం సదస్సుకు జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రాసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచపాళెం చంద్రశేఖరరెడ్డి, కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు తుమ్మల రామకష్ణ, కేంద్ర సాహిత్య యువ పురస్కార్‌ అవార్డు గ్రహీత మంత్రి కష్ణమోహన్‌ తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ...నవలా రచయితలకు రాయలసీమనే గొప్ప వేదిక అన్నారు. రాయలసీమ ప్రాంతంలో తెలుగు నవల నరహరి గోపాల కష్ణశెట్టి ‘రంగరాజ చరిత్ర’తో ప్రారంభమైందన్నారు. ఆ తరువాత వచ్చిన నవలు పెద్దగా ఆదరణ పొందకపోవడంతో నవల సంపత్తి సన్నగిల్లినట్లు పేర్కొన్నారు. సామాజిక చైతన్యంలో నవల క్రీయాశీలక పాత్ర పోసిస్తుందని విశిష్ట అతిథి తుమ్మల రామకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థులు నవలా రచయితలుగా రాణించాలంటే సామాజిక స్పృహను కలిగి ఉండాలని, ప్రతి రోజు దినత పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్‌ కాలాలను సమగ్రంగా చదువుకోవాలని కేంద్ర సాహిత్య యువ పురస్కార్‌ అవార్డు గ్రహీత మంత్రి కృష్ణకుమార్‌ అన్నారు.
 
రాయలసీమలో కరువు తాండవిస్తున్నా నవలా సాహిత్యానికి ఆదరణకు కరవు లేదని సదస్సు సంచాలకులు డా..పి.విజయకుమార్, ఉప సంచాలకులు పార్వతీ తెలిపారు. అనంతరం వీఆర్‌ రాసాని, జంధ్యాల రఘుబాబు, డాక్టర్‌ పొదిలి నాగరాజు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య తుమ్మల రామకృష్ణ పత్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖాదర్, చంద్రశేఖర కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మ, డాక్టర్‌ ఆదవాని హనుమంతప్ప, డాక్టర్‌ పురోహితం శ్రీనివాసులు, డాక్టర్‌ ఆంజనేయులు, డాక్టర్‌ కేశవులు, సాయిసుజాతలతోపాటు పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు