శేఖర్‌బాబును ఆదర్శంగా తీసుకోవాలి

4 Sep, 2016 00:46 IST|Sakshi
శేఖర్‌బాబును ఆదర్శంగా తీసుకోవాలి
  •  స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య 
  • రెండో రోజుకు చేరిన తెలంగాణ రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం
  • అలరించిన వీరపాండ్య కట్టబ్రహ్మన నాటకం
  • హన్మకొండ కల్చరల్‌ : పద్యనాటకం కోసం పందిళ్ల శేఖర్‌బాబు ఎన్నో త్యాగాలు చేశారని, తెలంగాణ కళాకారులందరూ ఆయనను ఆదర్శం గా తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో పం దిళ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో హ న్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం శనివారం రెండో రో జుకు చేరింది. ఈ సందర్భంగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు అధ్యక్షతన జరిగిన ప్రదర్శనను ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించి మాట్లాడా రు. శేఖర్‌బాబు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన వారు కా వడం తమకు గర్వకారణమన్నారు. గ్రామీణ కళాకారులకు తెలంగా ణ ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ పౌరాణిక నాటక ప్రదర్శనలను చూడడం ద్వా రా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో శేఖర్‌బాబు తమతో కలిసి పనిచేశారని తెలిపారు. శేఖర్‌బా బు కళారంగానికి ఎనలేని సేవలు అందించారన్నారు. అనంతరం సా మాజిక చైతన్య కళాకారుడు, వల్లంపట్ల ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు వల్లంపట్ల నాగేశ్వర్‌రావును.. ఎమ్మెల్యే, సీపీ శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బోయినపల్లి పురుషోత్తమరావు(పంథిని), పందిళ్ల అశోక్‌కుమార్, వనం లక్ష్మీకాంతారావు, డాక్టర్‌ ఇందారపు కిషన్‌రావు,బూరవిద్యాసాగర్, జ్యోతి జయకర్‌రావు, ఆకుల సదానందం, బిటవరం శ్రీధర స్వామి, ఎం.సదానందచారి, ఎ.శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.  
    అలరించిన నాటక ప్రదర్శన..
    శౌర్య పరాక్రమాలకు మారుపేరుగా, స్వాతంత్య్రయోధుడిగా కీర్తిగాం చిన వీరపాండ్య కట్టబ్రహ్మన చరిత్రను ఆర్‌.గుండయ్య సమర్పణ లో, కె.విశ్వనాథశాస్త్రి, డాక్టర్‌ నర్సయ్య దర్శకత్వంలో ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహæనాట్యమండలి కళాకారులు అద్భుతంగా ప్రదర్శిం చారు.  ఇందులో కె. నరహరి, డాక్టర్‌ సంగనభట్ల నర్సయ్య, బి. కిశో ర్, ఎస్‌. రామకిష్టయ్య, ఎస్‌. కిషన్, పి. బాలకృష్ణ, కె. అనిల్‌కుమార్, కె. అమ ర్‌. బి. నరహరి, ఎస్‌. విజయ్‌కుమార్, వి. పురుషోత్తం, కె. శివప్రసా ద్, ఎం. శ్రీనివాస్‌ తదితరులు నటించారు. కె.దత్తాత్రేయశర్మ సంగీ తం, కె.దత్తాత్రి, కె.వి.రమణ నిర్వహణ సహకారం అందజేశారు. కా గా, ఆదివారం సాయంత్రం నగరంలోని కాకతీయ నాటక కళాపరిష త్‌ సభ్యులు మకుటాయమానం భావించే గయేపాఖ్యాన ం నాటకం ప్రదర్శించనున్నారు.  
మరిన్ని వార్తలు