బాలల కెబినెట్‌ ఎన్నిక

3 Sep, 2016 00:28 IST|Sakshi
గద్వాల న్యూటౌన్‌ : స్వచ్ఛ విద్యాలయలో భాగంగా శుక్రవారం పట్టణంలోని బుర్దపేట ఉన్నత పాఠశాలలో బాలల క్యాబినెట్‌ ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్‌ తెలిపారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థుల చొప్పున అయిదు తరగతులకు 25 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, విద్యా, పర్యావరణ, తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, క్రీడలు, ఆరోగ్యం, నైతిక విలువలు తదితర మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన మంత్రిగా విద్యార్థి చంద్రశేఖరాచారి, ఉప ప్రధానిగా జగదీశ్వరి ఎన్నికయ్యారు. బాలల క్యాబినెట్‌ ద్వారా పాఠశాల మరింత అభివద్ధి చెందుతుందని హెచ్‌ఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భానుప్రకాష్, ఏఎన్‌ చారి, కష్ణకుమార్, శ్రీనివాసులు, కష్ణయ్య, జ్యోత్సS్న, అనిత తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు