తైక్వాండోతో ఆత్మరక్షణ

15 Apr, 2017 23:40 IST|Sakshi
తైక్వాండోతో ఆత్మరక్షణ

కర్నూలు(టౌన్‌) : ఆత్మరక్షణకు  తైక్వాండో ఎంతో అవసరమని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక యునైటెడ్‌ క్లబ్‌ యోగా హాల్‌లో రాష్ట్రస్థాయి యంగ్‌మూడో (తైక్వాండో) పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం ఆయుధం అవసరం లేని ఆయుధమే యంగ్‌మూడో క్రీడ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ క్రీడకు మంచి ప్రాచుర్యం పొందిందన్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అలాగే జాతీయ స్థాయి యంగ్‌మూడో పోటీల్లో ప్రతిభ కనపరచి విజేతలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యంగ్‌మూడో సౌత్‌జోన్‌ డైరెక్టర్‌ ఫ్రాంక్‌ ఎడెల్‌ సహాయ్‌ రాష్ట్ర ప్రతినిధి దాదాబాషా, సహాయ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు