విత్తనోత్పత్తితో స్వయం సమృద్ధి

24 Oct, 2016 21:38 IST|Sakshi
విత్తనోత్పత్తితో స్వయం సమృద్ధి
నంద్యాలరూరల్‌:  ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాల కోసం రైతులు పరిగెత్తడం సర్వ సాధారణంగా మారిందని, ఈ పద్ధతికి స్వస్థి పలికి రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్‌ గోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో మిరప, అపరాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  రైతులు సొంతంగా వ్తినాలను ఉత్పత్తి చేసుకొని సాగు చేసుకోవడానికి అనువైన వాతావరణం జిల్లాలో ఉందన్నారు. శనగ, వేరుశనగ, జొన్న, కొర్ర, సోయచిక్కుడు, పెసర, మినుము, కంది పంటల సాగులో కర్నూలు జిల్లా ముందుందని వివరించారు. సుమారు లక్ష ఎకరాల్లో అపరాల సాగు అంతర్‌పంటగా సాగులో ఉందన్నారు.     శనగ సాగులో కర్నూలు జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని వివరించారు. రైతులు మూడేళ్లకోసారి విత్తన, పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. నందిరైతు సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎన్‌.నాగరాజరావు, డాక్టర్‌ జయలక్ష్మి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు