పేపర్‌ రహిత ఫైళ్లు పంపండి

18 Sep, 2017 22:09 IST|Sakshi
  •  అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశం
  • అనంతపురం అర్బన్‌:

    జిల్లాలోని ప్రభుత్వాధికారులు తప్పని సరిగా ఫైళ్లను ఈ–ఆఫీసు ద్వారానే పంపించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మీ కోసం అనంతరం డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రీవెన్స్‌ ద్వారా పరిష్కరించేవాటిని కూడా ఈ–ఆఫీసులో ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. అలర్ట్‌ మేనేజ్‌మెంట్‌సిస్టం, ముఖ్యమంత్రి కార్యాలయం అందే ఉత్తర్వులతో పాటు, ప్రజా వేదిక అర్జీలను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థికపరమైనవి మినహా మిగిలిన సమస్యలు వెనువెంటనే పరిష్కారం కావాలన్నారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ కోర్టు పెండింగ్‌ కేసులకు సంబంధించిన వాటిపై కూడా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టి సమగ్ర నివేదికలు అందించి, ముగింపు ఉత్తర్వులను పొందాలని సూచించారు. ‘ఫీల్డ్‌ విజిట్‌ మేనేజ్‌మెంట్‌’పై అధికారులకు డెమో ద్వారా ఎన్‌ఐసీ ఇన్‌చార్జి డీఐఓ దీక్షితులు వివరించారు.

మరిన్ని వార్తలు