ఉరవకొండలో వరుస చోరీలు

26 Apr, 2017 00:17 IST|Sakshi
ఉరవకొండ: ఉరవకొండలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక లాలూస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రాజేశ్వరి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు, వెండి నగలను అపహరించారని ఏఎస్‌ఐ మహేంద్ర తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంటి బయట నిద్రిస్తున్నట్లు వివరించారు. ఆ తరువాత మల్లేశ్వరస్వామి ఆలయంలోనూ దొంగలు ప్రవేశించారు. స్వామి వారి హుండీని ధ్వంసం చేసి, అందులోని వేలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారని చెప్పారు. అర్చకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా డాగ్‌స్కా్వడ్‌ను రప్పించి రాజేశ్వరి ఇంట్లో తనిఖీ నిర్వహించారు. త్వరలోనే దొంగలను గుర్తించి పట్టుకుంటామని ఆయన చెప్పారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు