ఖాకీల మానవత్వం

22 Apr, 2017 01:05 IST|Sakshi
ఖాకీల మానవత్వం

⇒ యాచకుడికి సేవలు
⇒ అనాథశరణాలయంలో అప్పగింత


మాచారెడ్డి(కామారెడ్డి): మాచారెడ్డి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వచ్చిన ఓ యాచకుడిని అక్కున చేర్చుకుని ఆకలి తీర్చారు. అంతేకాకుండా అతడికి క్షవరం చే యించి కొత్తబట్టలు కట్టించారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయిలోని అనాథశరణాలయంలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవా రం మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో నిస్సాహాయస్థితిలో పడి ఉన్న ఓ యాచకుడిని పోలీసులు గుర్తించారు.

ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అన్నం పెట్టించారు. శారీరకంగా, మానసికంగా దయనీయ పరి స్థితిలో ఉన్న అతడికి క్షవరం చేయించారు. అతడి వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఆ యాచకుడికి మాటలు రాలేదు. దివ్యాంగుడని గుర్తించిన పోలీసులు అతడిని అనాథశరణాలయంలో చేర్పిం చాలని నిర్ణయించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ లచ్చయ్యగౌడ్, కాని స్టేబుల్‌ బాలు అతడిని తీసుకుని వెళ్లి ఉగ్రవాయిలోని అనాథశరణాలయంలో చేర్పించారు.

నేడు గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు
కామారెడ్డి : గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీకి సంబంధించి జిల్లాస్థాయి అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం కామారెడ్డిలో ని పార్శిరాములు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షత జరిగే సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సింధే పాల్గొంటారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు