అమరావతి చేరుకునేందుకు ఏడు మార్గాలు

22 Oct, 2015 08:42 IST|Sakshi

- గుంటూరురేంజ్ ఐజీ ఎన్.సంజయ్


గుంటూరు : గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం గ్రామంలో గురువారం జరుగుతున్న అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులకు ఏడు మార్గాలను గుర్తించామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ తెలిపారు.  వాహనదారులు శంకుస్థాపనకు చేరుకోవాల్సిన మార్గాల గురించి వివరించారు. అది ఆయన మాటల్లోనే..


విజయవాడ వైపు నుంచి వచ్చే సాధారణ సందర్శకులు, భారీవాహనాలు ...
కనకదుర్గమ్మ వారధి, మంగళగిరిపాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కు చేసుకోవాలి.
 
తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు - గుంటూరు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు
తమిళనాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి చిలకలూరిపేట మీదుగా శంకుస్థాపన స్థలానికి వచ్చే వాహనాలు చిలకలూరిపేట, గుంటూరు బైపాస్‌రోడ్డు, పెదకాకాని, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి.
రాయలసీమ జిల్లాలు (కర్నూలు, కడప,  అనంతపురం)భారీ వాహనాలు...
వినుకొండ, నరసరావుపేట బైపాస్, ములకలూరు, ముప్పాళ్ళ, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్ళూరు బైపాస్‌రోడ్డు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి.
చిన్న వాహనాలు :
 నరసరావుపేట బైపాస్, పేరేచర్ల, గుంటూ రు అవుటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి.

హైదరాబాద్ నుంచి భారీ వాహనాలు
హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, పెదకూరపాడు, అమరావతి, తుళ్ళూరు బైపాస్, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి.
చిన్న వాహనాలు:
హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, గుంటూరు అవటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి.
 
ఏఏఏ పార్కింగ్ ఏరియాలో గవర్నర్లు, సీఎంలు, జడ్జిలు, వివిధ దేశాల అంబాసిడర్లు, వివిధ దేశాల ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక స్థలం కేటాయించడమైంది.
క్యాబినెట్ మినిస్టర్ల వాహనాలు మార్షలింగ్, రీమార్షలింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు.
ఒక వాహన మార్గానికి రెండోవాహన మార్గం అడ్డురాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
శంకుస్థాపన కార్యక్రమం జరిగే 22వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవాడ - మంగళగిరి రోడ్డులో ప్రకాశం బ్యారేజీపై ఎటువంటి వాహనాలు సంచారం అనుమతి లేదు. విజయవాడ నుంచి గుంటూరు వైపు అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడవైపు తిరుగు వాహనాలు ప్రయాణించుటకు కనకదుర్గవారధి పూర్తికాలం అనుమతి ఉంటుంది.
శంకుస్థాపన జరిగే 22వ తేదీ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శంకుస్థాపన ప్రదేశానికి వాహనాలు సులువుగా వెళ్ళుటకు గాను అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది.
అదేవిధంగా మధ్యాహ్నం 1.45 నుంచి శంకుస్థాపన స్థలం నుండి బయటకు వెళ్ళే వాహనాలు సులువుగా తిరుగు ప్రయాణం చేయుటకు అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది.
మధ్యాహ్నం 11.30 గంటల తరువాత కరకట్టపైన ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదు.
 
 ఏఏ, ఏ పాస్‌లు కలిగిన వాహనదారులు
 గన్నవరం విమానాశ్రయం నుంచి బెంజిసర్కిల్, కనకదుర్గమ్మ వారధి, ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి జంక్షన్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేయబడిన రోడ్డు నుంచి శంకుస్థాపన స్థలానికి చేరుకుని కుడిపక్కన ఏర్పాటు చేసిన ఏఏ, ఏ పార్కింగ్ నందు వాహనాలు నిలుపుకోవాలి.
హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, కనకదుర్గమ్మ వారధి, ఉండవల్లి సెంటర్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా ఏర్పాటు చేసిన మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి.
గుంటూరువైపు నుంచి వచ్చే వాహనాలు  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్‌ప్లాజా, ఎన్టీఆర్ కరకట్ట బోట్‌హౌస్, ఉండవల్లి సెంటర్, కరకట్టకు సమాంతరంగా ఏర్పాటు చేయబడిన కొత్త మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి.

మరిన్ని వార్తలు