సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

14 Apr, 2016 19:00 IST|Sakshi
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

పోలీసుల అదుపులో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు
 
 శ్రీకాకుళం సిటీ : పట్టణంలో కళింగరోడ్డు ప్రాంతంలోని ఓ నివాసంలో సెక్స్‌రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు మానవ అక్రమరవాణా నిరోధకశాఖ అధికారులు(ఏహెచ్‌టీయూ), ఐసీపీఎస్, రెండో పట్టణ పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతోపాటు పి.సత్యనారాయణ, వై.శరత్‌బాబు అనే విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ దాడి మోహనరావుకు అప్పగించారు.
 
  ఏహెచ్‌టీయూ విభాగం ఎస్‌ఐ లక్ష్ముయ్య మాట్లాడుతూ కొద్దిరోజులుగా వీరిపై నిఘా పెట్టినట్లు వివరించారు. పట్టణంలో పీఎన్ కాలనీ, న్యూ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో నివాసాలను మారుస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ దాడుల్లో ఏహెచ్‌టీ యూ ఏఎస్‌ఐ రమణ, హెచ్‌సీలు రెడ్డి, జగదీశ్వరరావు, పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్ . భాస్కరరావు, బి.జగదీష్‌కుమార్, ఎన్. జగదీష్, ఐసీపీఎస్ డీసీపీవో కె.వి. రమణ, రెండో పట్టణ ఎస్‌ఐ కుమార్, సోషల్‌వర్కర్లు బి.రాజు, జనార్దన్ పాల్గొన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు