లైంగిక వేధింపుల నుంచి కాపాడే బాధ్యత అధికారులదే

12 Dec, 2016 14:45 IST|Sakshi
లైంగిక వేధింపుల నుంచి కాపాడే బాధ్యత అధికారులదే

పోలీస్ కమిషనర్ కార్తికేయ

నిజామాబాద్ క్రైం : బాలికలను వేధింపుల నుంచి కాపాడే బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉందని పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నారు. శనివారం సీపీ కార్యాలయంలో చైల్డ్‌లైన్ 1098 నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలల వారోత్సవాల్లో భాగంగా పీఎంసీఎస్‌వో 2012 యాక్ట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ మాట్లాడుతూ బాలికల విషయంలో ప్రభుత్వ శాఖలు అన్ని అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అన్ని డివిజన్లకు పోస్టర్లను పంపాలని 1098 సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ వెంకన్న, సీసీఆర్‌బీ సీఐ సుధాకర్, ఏవో గులాం మొహినొద్దీన్, ఐటీ కేర్ ఇన్‌చార్జి గంగాధర్, బాలల సంరక్షణ సమితి ప్రతినిధులు శ్రీరాంచంద్ నాయక్, నరసింహం, 1098 సిబ్బంది కో-ఆర్డినేటర్స్ స్వప్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు