బాలికపై లైంగిక దాడికి యత్నం

23 Jul, 2016 14:39 IST|Sakshi
పమిడిముక్కల : మతిస్థిమితంలేని బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐదుకూరు గ్రామానికి చెందిన బాలి నీలాంబరం(30) అనే యువకుడు  అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కుటుంబసభ్యులు కూలిపనికి వెళ్లిన సమయంలో నీలాంబరం మాయమాటలు చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగువారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు