23 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు

2 Aug, 2016 21:14 IST|Sakshi
కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆహ్వానసంఘం ప్రతినిధులు కోరారు. నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో విద్యారంగం గందరగోళంగా తయారైందన్నారు. విద్యాసంస్థలకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయని ఆరోపించారు. విద్యారంగానికి జరుగుతున్న అన్యాయం, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై  సమావేశాల్లో  చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతి, కార్యదర్శి బత్తిని సంతోష్, సుప్మా అధ్యక్షుడు సతీష్‌కుమార్, వాగేశ్వరి విద్యాసంస్థల చైర్మన్‌ బీఆర్‌.గోపాల్‌రెడ్డి, ట్రస్మా నగర అధ్యక్షుడు చెన్నప్ప, నాయకులు అరుణ్, మారుతి, రవీందర్, శ్రీకాంత్, కుమార్, నాగరాజు, రజనీకాంత్, ప్రశాంత్‌ పాల్గొన్నారు.
ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా దాసరి మనోహర్‌రెడ్డి
ఈ సందర్భంగా ఆహ్వానసంఘాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అధ్యక్షుడిగా ముద్దసాని రమేశ్‌రెడ్డి(శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌), ప్రధానకార్యదర్శిగా బత్తిని సంతోష్‌ (ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి), ట్రెజరర్‌గా మాదం తిరుపతి(ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు), చీఫ్‌ ఫ్యాట్రన్స్‌గా వి.నరేందర్‌రెడ్డి(అల్ఫోర్స్‌ చైర్మన్‌), జె.ప్రభాకర్‌గౌడ్‌(టీటీజేసీఎంఏ జిల్లా కార్యదర్శి), యాదగిరి శేఖర్‌రావు(ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి), కె.అనంతరెడ్డి(మానేరు విద్యాసంస్థల అధినేత), వి.సతీష్‌కుమార్‌(సుప్మా జిల్లా అధ్యక్షుడు), బీఆర్‌ గోపాల్‌రెడ్డి(నిగమ విద్యాసంస్థల చైర్మన్‌), కె.చెన్నప్ప(ట్రస్మా నగర అధ్యక్షుడు), శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆహ్వాన సంఘం ప్రతినిధులు తెలిపారు.
 
 
>
మరిన్ని వార్తలు