డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

28 Aug, 2016 00:20 IST|Sakshi
డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్‌ : ఈనెల 30న నిర్వహించనున్న సామూహిక డీఈసీ, ఆల్బెండోజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బంది  కృషి చేయాలని సీఐఓ డాక్టర్‌ ఏబీ. నరేంద్ర, జిల్లా మలేరియాధికారి ఓంప్రకాశ్‌ కోరారు. శనివారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన క్లస్టర్‌ సమావేశంలో వారు మాట్లాడారు. పైలేరియా వ్యాధి నివారణ, నట్టల నివారణ కోసం మాత్రలను మింగించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల లోపు చిన్నారులకు మాత్రలు అవసరం లేదని, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలల్లోపు వయస్సు వారికి 1 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్‌ మాత్రలను మింగించాలన్నారు. 5–14 సంవత్సవరాల్లోపు వారికి 2 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్, 15 సంవత్సరాల పై వయసు వారికి వారందరికి 3డీఈసీ, ఒక ఆల్బెండోజోల్‌ మాత్రలను మింగించాలని సూచించారు. గర్భవతులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు మాత్రలు వేసుకోరాదని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు