అర్హులకు రాయితీ అందకుంటే ఉద్యమం

16 Jul, 2017 22:23 IST|Sakshi
అర్హులకు రాయితీ అందకుంటే ఉద్యమం

చిలమత్తూరు : అర్హులైన రైతులందరికీ పంట రాయితీ అందకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన చిలమత్తూరులో ముస్లిం సోదరుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పంట రాయితీ ఏకపక్షంగా జమ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని,  దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలని ప్రశ్నించారు.

రాగ మయూరి ఎల్‌సీనా పరిశ్రమ,  సెంట్రల్‌ ఎక్సైజ్‌ అకాడమీ తదితర పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి తక్కువ నష్టపరిహారం రైతులకు ఇచ్చి టేకులోడు, నల్లబొమ్మనపల్లి, ఆరుమాకులపల్లి గ్రామాల రైతులతో 210 ఎకరాల భూములు సేకరించారని ఎద్దేవా విమర్శించారు. పెనుకొండ, గొల్లపల్లి, అమ్మవారిపల్లి గ్రామాల సమీపంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు కూడా అధికార పార్టీ నేతల రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా మారిందని మండిపడ్డారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కన్వీనర్లు వెంకటరత్నం, సుధాకర్‌రెడ్డి, కొండలరాయుడు, రాజగోపాల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, యాసీన్, తుంగోడు నారాయణరెడ్డి, స్థానిక నాయకులు జబీవుల్లా, లక్ష్మీనారాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు