'నిన్నటి దుర్ఘటనకు చింతిస్తున్నా'

15 Jul, 2015 10:36 IST|Sakshi

రాజమండ్రి: గోదావరినది అతి పవిత్రమైందని ... ఆ నదీ స్నానం ఎక్కడైనా ఆచరించవచ్చునని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంగళవారం కోటగుమ్మం పుష్కరఘాట్లో చోటు చేసుకున్న తొక్కిసలాట దుర్ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు సంయుక్తంగా పని చేయాలని రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖలకు స్వరూపానందేంద్ర సూచించారు.

అలాగే ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు.  అయితే గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రిలోకి కోటగుమ్మం పుష్కరఘాట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 35 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు