శంషాబాద్ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్

13 Nov, 2015 16:21 IST|Sakshi

శంషాబాద్: మహిళల రక్షణను మరింత పటిష్టపరం చేసేందుకు వీలుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్ (మహిళలు నడిపే కార్లు) అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు.

ప్రస్థుతం 10 క్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామని సీవీ ఆనంద్ తెలిపారు. మహిళా ప్రయాణికురాలితోపాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు షీ క్యాబ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.

 

మరిన్ని వార్తలు