శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్‌

15 Mar, 2017 01:15 IST|Sakshi
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్‌

తమిళ కూలీల స్థావరాలు గుర్తింపు
చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా
ఫారెస్టు, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ దాడులు ముమ్మరం


భాకరాపేట: తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో శేషాచలం అడవుల్లో చేపట్టిన కూంబింగ్‌ కొనసాగుతోంది. తమిళ కూలీలు రాత్రిపూట ఉండే ప్రధాన స్థావరాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలో పరిధిలో ఉన్న ఎర్రచందనం వనాలలోని 28 స్థావరాలను గుర్తించారు. రాత్రిపూట ఉండేందుకు ఈ స్థావరాలు అనువుగా ఉన్నాయని, సమీపంలో తాగునీటి వసతి ఉండడంతో కూలీలు వాటినే కుటీరాలుగా మలుచుకున్నారని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు చెబుతు న్నారు. ఈ స్థావరాలపై దృష్టి పెట్టడంతోనే నాలుగు రోజుల క్రితం వందలాది మంది కూలీలను టాస్క్‌ఫోర్స్, ఫారెస్టు అధికారులు వైఎస్సార్‌ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పట్టుకోగలిగారు.

సరిహద్దులపై ప్రత్యేక నిఘా..
శేషాచలం అటవీ ప్రాంతంలోని చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లా సరిహద్దులపై టాస్క్‌ఫోర్స్‌ నిఘా పెట్టింది. సరిహద్దులు దాటిపోతున్న అక్రమ వాహనాలు, అందుకు సహకరిస్తున్న వారిని కూడా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా వైఎస్సార్‌ జిల్లా భాకరాపేట, చిత్తూరు జిల్లా భాకరాపేట కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య కాలంలో భాకరాపేట నుంచి టాస్క్‌ఫోర్స్, పోలీసు, ఫారెస్టు అధికారులకు సమాచారం వస్తోంది. అధికారులు అక్కడికి చేరుకునే లోపు దొంగలు తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో భాకరాపేటలో ప్రొటెక్షన్‌ వాచర్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు.

దాడులు ముమ్మరం..
టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లా పోలీసు అధికారులు సైతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న పీలేరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలోని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. భాకరాపేట కేంద్రంగా నాలుగు రోడ్ల కూడలిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి వాహనాలను గమనిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా భాకరాపేటలో నిఘా పెంచారు.

మరిన్ని వార్తలు