గోలీ.. ఖాళీ

14 Sep, 2017 13:09 IST|Sakshi
గోలీ.. ఖాళీ

పెద్దాస్పత్రిలో ఔషధాల కొరత
ఓ వైపు విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు
మరోవైపు అందుబాటులో లేని మందులు
అరకొర మాత్రలతో రోగులకు తిప్పలు
జీఎస్టీ పేరుతో చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు


ఓ పక్క సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. పెద్దాస్పత్రిగా పేరుగాంచిన మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రిలో నమోదయ్యే ఓపీ సాధారణ రోగుల సంఖ్య రోజుకు రెండు వేల నుంచి మూడు వేలకు చేరుకుంది. ఇలాంటి సీజన్‌లో అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన సేవలందించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న ఔషధాల కొరత వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిడియాట్రిక్‌ విభాగంలో చిన్న పిల్లలు, పెద్దలకు జ్వరం, దగ్గు వంటి తదితర వ్యాధులకు సంబంధించిన పలురకాల మందులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి.

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి.. ‘యమ’జీఎంగా మారింది. ఏటేటా పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలందకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరికరాల లేమి.. వసతుల కొరత.. అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్యం అందని దైన్య పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రిని ఔషధాల కొరత పీడిస్తోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎలాంటి ఔషధాలు ఉన్నాయి.. వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో ఎంత మేర అవసరమవుతాయో.. అనే కోణంలో పరిపాలనాధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఔషధాల కోసం కుస్తీ పట్టగా.. రాసిన ఐదు రకాల్లో ఒకటో.. రెండో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడానికి వెళితే.. ఆస్పత్రిలో పరిపాలనాధికారుల జాడ తెలియడం లేదని రోగులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పెద్దాస్పత్రికి వస్తున్నామని.. వందల రూపాయలు వెచ్చించి బయట కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. అరకొర మందులతో వ్యాధుల తగ్గుముఖం పట్టకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీజనల్‌ కాలంలో...
సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న క్రమంలో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో మేల్, ఫిమేల్‌ ఓపీలలో నిత్యం వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఇన్‌పెషెంట్‌గా అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. మిగతా రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి యాంటీబయోటిక్‌తో పాటు  వివిధ రకాల ఔషధాలను రాసి పంపిస్తున్నారు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఆస్పత్రిలో ఫార్మసీ విభాగానికి వెళ్లిన రోగులకు భంగపాటు తప్పడం లేదు. అరకొరగా మాత్రలు ఇస్తుండడంతో పేద రోగులు ఏంచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు.

వారం క్రితమే నిండుకున్నాయి..
సీజనల్‌ వ్యాధుల సమయంలో అందించే ఆమాక్సిలిన్‌ క్లవ్‌నెట్‌ వంటి యాంటీబయోటిక్‌ మాత్రల నిల్వలు వారం రోజుల క్రితమే నిండుకుంటున్నాయి. అయినప్పటికీ పరిపాలనాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా సాధారాణంగా అందించే బీపీ, కోలోబీపీ, కొలెస్ట్రాల్, లివర్, మలేరియాకు సంబంధించిన ఔషధాల నిల్వలు ఆస్పత్రిలో పూర్తిగా నిండుకున్నాయి. నొప్పులకు కోసం అందించే ఔషధాలు సైతం ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల విభాగానికీ తప్పని తిప్పలు..
ఎంజీఎం ఆస్పత్రిలో పిడియాట్రిక్‌ విభాగాన్ని సైతం ఔషధాల కొరత ఇబ్బంది పెడుతోంది. చిన్న పిల్లలకు అందించే పారాసిట్మాల్‌ సిరప్‌ సైతం అందుబాటులో లేదు. దగ్గు, యాంటీబయోటిక్‌ సిరప్‌లు లేకపోవడంతో చిన్నారులు తల్లులు వైద్యుల చీటీలు పట్టుకుని ప్రైవేట్‌ మెడికల్‌ హాళ్లకు పరుగులు పెడుతున్నారు. పిడియాట్రిక్‌  విభాగంలో రెండు నెలల నుంచి సెఫీక్సిమ్‌ యాంటీబయోటిక్‌ సిరప్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా, జీఎస్టీ పేరుతో కాంట్రాక్టర్లు సరఫరా చేయకుండా చేతు లెత్తేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.

స్టోర్‌ సిబ్బంది నిర్లక్ష్యం..
ఔషధాల కొరతను గుర్తించి.. నిండుకున్న నిల్వలపై ఎప్పటికప్పడు ఎంజీఎం పరిపాలనాధికారులకు సమాచారం అందించాల్సిన స్టోర్‌ సిబ్బందిలో నిర్లక్ష్యం ఆవహించినట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా సరఫరా లేని సమయంలో అలాంటి ఔషధాలను టెండర్‌ ద్వారా కొనుగోలు చేసి రోగులకు అందించాల్సి ఉంది. ఔషధాలు పూర్తి స్థాయిలో నిండుకున్నప్పటికీ.. వారు స్పందించడం లేదు.

పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం లేదు..
కడుపునొప్పితో వచ్చా. ఒక రకం గోలి లేదని పంపించేశారు. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో మందులు అందించాలి.
– బాబు, వరంగల్‌

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’