చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

13 Feb, 2017 22:32 IST|Sakshi
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

జూనియర్‌ సివిల్‌ జడ్జి తిరుపతి
కాల్వశ్రీరాంపూర్‌: పౌరులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి తిరుపతి అన్నారు. మండలంలోని పెగడపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సును ఆదివారం నిర్వహించారు. సందర్భంగా చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు లోక్‌అదాలత్‌లతో సత్వర పరిష్కారం, న్యాయసేవాధికారి సంస్థ ద్వారా ఉచిత న్యాయసలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవసరమైన సలహాలు అందించేందుకు ప్రతీ ఆదివారం న్యాయప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు.

గిప్టుడీడీ, వీలునామా, సేల్‌డీడీ, పార్ట్‌నర్‌షిప్‌ డీడీ, సివిల్, క్రిమినల్‌ కేసులపై వివరించారు. పట్టింపులకు పోకుండా రాజీ మార్గమే ఉత్తమని తద్వారా చాలా కేసులు సత్వర పరిష్కారం పొందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచు గొడ్గు లక్ష్మి రాజకొమురయ్య, ఎస్సై ఉమాసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు