తమ్ముడి కోసం... సోదరి సాహసం!

8 Mar, 2016 05:06 IST|Sakshi
తమ్ముడి కోసం... సోదరి సాహసం!

ఆండీస్ పర్వతారోహణ చేసిన డాక్టర్ మల్లి దొరసానమ్మ
మల్లి మస్తాన్‌బాబు పేరుతో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు
 

బుచ్చిరెడ్డిపాళెం: నాడి పట్టాల్సిన ఆమె నడక సాగించారు... తమ్ముడి ఆశయం కోసం సాహసిం చారు. ఆండీస్ పర్వతారోహణ చేసి ధీరురాలిగా నిలిచారు. తమ్ముడు తుదిశ్వాస విడిచిన చోట నివాళులర్పించారు. మౌంటనీరింగ్ ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. మస్తాన్‌బాబు ప్రారంభించిన మై సెవెన్ సమ్మిట్ పుస్తకంలో మిగిలిన చివరి మజిలీ అంశాలను పొందుపరుస్తున్నారు. భారతరత్న అవార్డుకు అర్హుడైన మల్లిమస్తాన్‌బాబుకు అవార్డు ఇవ్వాలని ఆయన సోదరి మల్లి దొరసానమ్మ కోరుతున్నారు.
 
 తమ్ముడి మాటలతో కలిగిన ఆసక్తి:
 నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల వ్యాధులను నయం చేసే పనిలో పడిన డాక్టర్ మల్లి దొరసానమ్మకు తమ్ముడు మల్లి మస్తాన్‌బాబు పర్వతారోహణపై చెప్పే మాటలు ఆసక్తిని కలిగించాయి. పర్వతాలకు సంబంధించి గూగుల్ వెతుకులాటలో తమ్ముడు పడుతున్న తపన ఆలోచింపజేశాయి. పర్వతారోహణ అనంతరం మస్తాన్‌బాబుతో తన అనుభవాలు పంచుకునేవాడు. దీంతో 2008లో తమ్ముడితో కలిసి హిమాలయ పర్వతాల్లోని రేంజల్ పాక్స్ అనే పర్వతాలను అధిరోహించా. జనవరి 24వ తేదీన మల్లిమస్తాన్‌బాబు మృతిచెందిన చోటకు బయలుదేరి వెళ్లా.  

 భారతరత్న ఇవ్వాలి:
భారతరత్న అవార్డుకు తన తమ్ముడు మల్లి మస్తాన్‌బాబు అర్హుడని, ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అర్జీలు పంపానన్నారు.

మరిన్ని వార్తలు