హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి

12 Mar, 2017 21:56 IST|Sakshi
హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి
–శ్రీమఠం పీఠాధిపతి  సుభుదేంద్ర తీర్థులు
 
పెరవలి (మద్దికెర) : హిందూ సంప్రదాయం కాపాడాలని, ఇది ప్రతి హిందువు కనీస ధర్మమని  మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు అన్నారు. ఆదివారం మండలంలోని పెరవలిలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా స్వామిజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభుదేంద్ర తీర్థులు మాట్లాడుతూ మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే వారివారి మతాలను అగౌరపరచకుండా నడుచుకున్నపుడే జన్మ సార్థకమవుతుందన్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ విరాళదాత పారా విశ్వనాథ్, జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి, సర్పంచు వెంకట్రాముడు వర్మ, భక్తులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు