మట్టి వినాయకుని బ్యానర్‌ ఆవిష్కరణ

1 Sep, 2016 00:23 IST|Sakshi
బ్యానర్‌ ఆవిష్కరిస్తున్న జేసీ దివ్య


ఖమ్మం కల్చరల్‌ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను మాత్రమే వాడాలని జేసీ దివ్య అన్నారు. వాతావరణ కాలుష్యంతో కూడిన, నీటిలో కరగని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, జిప్సమ్‌తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని రోటరీక్లబ్‌ ఆఫ్‌ స్తంభాద్రి ఆధ్వర్యంలో స్థానిక నాగసాయి ఇండియన్‌గ్యాస్, నాగుబండి డెంటల్‌ క్లినిక్‌ వారు ముద్రించిన ‘మట్టి వినాయక విగ్రహాలు’ వాడాలనే క్లాత్‌ బ్యానర్‌ను జాయింట్‌ కలెక్టర్‌ దివ్య చేతుల మీదుగా బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ స్తంభాద్రి అధ్యక్షుడు శ్రీనివాస్, దశాబ్ది ఉత్సవ కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్, నాగేష్, వేములపల్లి సీతారాంబాబు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు