పోలీసుల మధ్య ఘర్షణ: ఎస్సైకి తీవ్రగాయాలు

1 Jun, 2016 08:05 IST|Sakshi

విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు పోలీసుల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భగవాన్‌తో కానిస్టేబుల్ అమ్మోరు డ్యూటీ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

కానిస్టేబుల్ అమ్మోరు తనను వెపన్తో కొట్టి గాయపరిచాడని ఎస్ఐ ఆరోపించాడు. అలాగే ఎస్ఐ భగవాన్ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా తరచు వేధించాడని కానిస్టేబుల్ ఆరోపించాడు. అయితే అమ్మోరును నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన ఎస్ఐ భగవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు