డమ్మీ కేబుల్‌ ఆపరేటర్‌కు సహకరిస్తున్న ఎస్సై

7 Aug, 2016 00:06 IST|Sakshi
  • పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆపరేటర్లు
  • వరంగల్‌ : పర్వతగిరి మండలం నారాయణపురంలోని కేబుల్‌ ఆపరేటర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న డమ్మీ ఆపరేటర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయనకే సహకరిస్తున్న ఎస్సైపై విచారణ జరపాలని తెలంగాణ రూరల్‌ ఎంఎస్‌ఓ, కేబుల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శనివారం పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్‌ ఆపరేటర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌కు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్‌ను నారాయణపురంలోని వాటర్‌ ట్యాంకు వద్ద మూడ్‌ రవి కట్‌ చేసి తన బంధువులకు కనెక్షన్‌ ఇచ్చాడని తెలిపారు.
     
    ఈ విషయమై పర్వతగిరి ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాల సీడీ అందజేస్తే ప్రొబెషనరీ ఎస్సైతో విచారణ చేయించారని పేర్కొన్నారు. అనంతరం అక్రమంగా బిగించిన ఓఎఫ్‌సీ వైరు తొలగించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ గత నెలలో వైర్‌ కట్‌ చేసి వేరే కనెక్షన్లు ఇస్తుండగా సూర రమేష్‌ను పట్టుకుని ప్రశ్నిస్తే ఎస్సై చెబితేనే చేస్తున్నట్లు తెలిపాడన్నారు. ఈ విషయమై ఎస్సైని కలిస్తే పట్టించుకోకపోగా పర్వతగిరి ఎంఎస్‌ఓకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపిం చాలని పర్వతగిరి ఎంఎస్‌ఓ గోగినేని భవానీశంకర్‌రావుతో పాటు అసోసియేషన్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్, సెక్రటరీ బైరీ శ్రీనివాస్, వంగాల ఉమాశంకర్‌లింగం, రాజేష్‌ కోరారు.  
మరిన్ని వార్తలు