చూసొద్దాం...

24 Apr, 2017 23:32 IST|Sakshi
చూసొద్దాం...
సైబీరియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంతానోత్పత్తికి చిలమత్తూరు మండలం వీరాపురానికి వస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఆలస్యంగానైనా వందల సంఖ్యలో కొంగలు వచ్చాయి. అరుదైన ఈ కొంగల సందడి చూడాలనుకుంటే జిల్లా కేంద్రం నుంచి 124 కిటోమీటర్ల దూరం ప్రయాణించి కొడికొండ చెక్‌పోస్టు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు.

హిందూపురం నుంచి వచ్చే సందర్శకులు లేపాక్షి ఆలయాన్ని చూసుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిలమత్తూరు మీదుగా వీరాపురం వెళ్లవచ్చు. అంతేకాక వీరాపురం నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎల్లోడు గ్రామ సమీపంలో ఆదినారాయణ కొండ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి రమణీయత ఒడిలో ఈ ఆలయం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. 
- చిలమత్తూరు (హిందూపురం)
మరిన్ని వార్తలు